ఎస్సీ, ఎస్టీ వర్గాల రక్షణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ వర్గాల రక్షణకు ప్రత్యేక చర్యలు

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

ప్రశాంతి నిలయం: ఎస్టీ, ఎస్టీ వర్గాల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంతో పాటు మాన్యువల్‌ స్కావెంజర్స్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అక్టోబర్‌ 8వ తేదీన రెవెన్యూ భవన్‌లో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా చివరి తేదీన రెవెన్యూ, పోలీస్‌, సాంఘిక సంక్షేమ శాఖ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో సివిల్‌ రైట్స్‌డేను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా దాడులు జరిగితే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని, బాధితులకు సత్వర పరిహారం అందించాలని ఆదేశించారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, ఎస్పీ సతీష్‌ కుమార్‌, డీఆర్‌ఓ కొండయ్య, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement