ఎమ్మెల్యే చెబితేనే ఎంజేపీలో సీటు! | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చెబితేనే ఎంజేపీలో సీటు!

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: రాప్తాడులో అరాచకం రాజ్యమేలుతోంది. సామాన్యులపై దౌర్జన్యాలు, దాడులతో రెచ్చిపోతున్న ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు చివరకు పేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతి గృహాల్లోని సీట్లకూ ఎసరు పెట్టారు. తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ ఆదేశాలివ్వడంతో ప్రిన్సిపాళ్లు కూడా వారి మాట తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నసనకోట ఎంజేపీ పాఠశాలలో ప్రవేశానికి పరీక్ష రాసి 60 మార్కులు సాధించిన ఓ విద్యార్థిని ప్రవేశం దక్కలేదు.

763వ ర్యాంకు దక్కినా... సీటు లేదంట

ఎంజేపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి (2026–27 విద్యా సంవత్సరం) ప్రభుత్వం ప్రవేశ పరీక్ష నిర్వహించగా...గనవి అనే విద్యార్థిని (హాల్‌ టికెట్‌ నంబర్‌ 26050920005) 100 మార్కులకు గానూ 60 మార్కులు సాధించి జిల్లాలో 763 ర్యాంక్‌ దక్కించుకుంది. అయితే తొలి విడత సీట్ల కేటాయిపులో గనవికి సీటు కేటాయించలేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను ఆశ్రయించి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. స్పందించిన బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి నిబంధనల మేరకు విద్యార్థినికి ప్రవేశం కల్పించాలని పాఠశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాశారు. ఈ లేఖ తీసుకుని రెండురోజుల క్రితం విద్యార్థి గనవి తల్లిదండ్రులతో కలిసి నసనకోట ఎంజేపీ పాఠశాలకు వెళ్లగా... ప్రిన్సిపాల్‌ జమునాభాయి ‘‘ఎమ్మెల్యే పరిటాల సునీత కానీ, ఆమె అనుచరులు ఎవరైనా చెబితేనే ఇక్కడ సీటు ఇస్తాం’’ అని చెప్పారు. దీంతో గనవి తల్లిదండ్రులు అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చేశారు. కష్టపడి చదివి ప్రవేశపరీక్ష రాసి ర్యాంకు సాధించినా సీటు ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌ జమునాభాయిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా..ఆమె స్పందించలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు చేటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.

పరిటాల బంధువు హవా..

ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువు ఒకరు పేరూరు డ్యాం (బీసీ బాలుర), నసనకోట (బీసీ బాలికల) పాఠశాలలపై పెత్తనం చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రవేశాలు, విద్యార్థులకు భోజనం, నీరు తదితర వ్యవహారాన్నీ ఆయనే చూస్తుంటారంటున్నారు. 5వ తరగతి అడ్మిషన్లతోపాటు పాఠశాలల్లో కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరిగేలా అధికారులకు ఆదేశాలిచ్చారని వాపోతున్నారు. విద్యార్థుల భోజనం, తాగునీరుపై కూడా ఆంక్షలు విధిస్తూ అరాచకం చేస్తున్నారని మండిపడుతున్నారు. విద్యార్థులు రోజూ రెండు లీటర్ల నీరే తాగాలని హుకుం జారీ చేస్తున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువు కావడంతో ఆయనపై ఫిర్యాదు చేసేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదంటున్నారు.

తేల్చిచెప్పిన నసనకోట ఎంజేపీ పాఠశాల

ప్రిన్సిపాల్‌

ప్రవేశపరీక్షలో 60 మార్కులు సాధించిన విద్యార్థికి ప్రవేశం

కల్పించని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement