ఆధునిక సాహిత్య వైతాళికుడు గురజాడ | - | Sakshi
Sakshi News home page

ఆధునిక సాహిత్య వైతాళికుడు గురజాడ

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

ప్రశాంతి నిలయం: తెలుగు సాహిత్యంలో వ్యవహారిక భాషకు పెద్దపీట వేసిన ఆధునిక సాహిత్య వైతాళికుడు గురజాడ అప్పారావు అని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ కొనియాడారు. మహాకవి, నాటకకర్త, సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలను సోమవారం రెవెన్యూ భవన్‌లో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ కొండయ్యతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని గురజాడకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ, ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ దిశానిర్దేశం చేశారన్నారు. తన సాహిత్యంతో సాంఘిక సంస్కరణలకు బాటలు వేశారన్నారు. నేటి తరం యువతకు, సాహిత్య రంగాలకు ఆయన ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు సాహిత్యాన్ని కవితాగానం చేశారు.

వీఆర్‌ఏల సహాయ నిరాకరణ

డిమాండ్లు నెరవేర్చేవరకూ

పోరాటం కొనసాగిస్తామని వెల్లడి

పుట్టపర్తి అర్బన్‌: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆరు రోజులుగా పోరుబాట పట్టిన గ్రామ సహాయకులు (వీఆర్‌ఏ) సోమవారమూ తమ ఆందోళన కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ప్రత్యేక దీక్షా శిబిరాల్లో కూర్చుని సహాయ నిరాకరణ చేశారు. వీరి ఆందోళనకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ... వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. 40 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న వీఆర్‌ఏలపై ప్రభుత్వం చిన్న చూపు చూడడం బాధాకరమన్నారు. అనంతరం పలువురు వీఆర్‌ఏలు మాట్లాడుతూ... పేస్కేల్‌ అమలు, కారుణ్య నియామకాలు, ప్రమోషన్లు తదితర డిమాండ్లు నెరవేర్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉప కార్యదర్శి వెంకటేశు, సీపీఐ ప్రాంతీయ కార్యదర్శి వినోద్‌, వీఆర్‌ఏల సంఘం నాయకులు ఓబులేశు, చంద్ర మోహన్‌, పోతులయ్య, నాగరాజు తదితరులు ఉన్నారు.

ఎస్కేయూలో పీజీ ప్రవేశాలు

అనంతపురం: ఎస్కేయూలోని క్యాంపస్‌ కళాశాలలో ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఆసక్తి గల వారు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఫిజిక్స్‌, ఎంఏ ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఎంకాం, ఎంబీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. సంబంధిత సబ్జెక్టులలో బీఎస్సీ (ఆనర్స్‌), బీఏ (ఆనర్స్‌), బీకాం (ఆనర్స్‌), బీబీఏ కోర్సుపూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను జతపరచాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి, ఈ నెల 30వ తేదీలోపు వర్సిటీ అడ్మిషన్‌ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement