ఎంపీపీ సంతకం ఫోర్జరీ! | - | Sakshi
Sakshi News home page

ఎంపీపీ సంతకం ఫోర్జరీ!

Sep 22 2026 1:36 AM | Updated on Sep 22 2026 1:36 AM

రొళ్ల: 16వ ఆర్థిక సంఘం నిధుల స్వాహాకు స్థానిక ఎంపీడీఓ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ఈ నెల 23న ఎంపీపీ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన రూ.97,78,080 నిధుల మంజూరు చేయించుకోవడం కోసం ఏకంగా ఎంపీపీ సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపిన సంఘటన మండలంలో చర్చనీయాంశమైంది.

పంచాయతీ తీర్మానం లేకుండానే...

ప్రభుత్వం రొళ్ల మండలంలోని వివిధ గ్రామాలకు 16వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను స్వాహా చేయాలని ప్లాన్‌ చేసిన ఎంపీడీఓ అధికారుల సాయంతో ఈ ఏడాది మే 5న ఎంపీపీ ఎస్‌ఆర్‌ సుమ సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లుగా నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఎంపీపీ సుమ సోమవారం సాయంత్రం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓ శ్రీనివాసరావును ప్రశ్నించారు. దీంతో ఎంపీడీఓ శ్రీనివాసరావు తన తప్పు ఒప్పుకుని క్షమించాలని వేడుకున్నారు. ఈ వ్యవహారంపై ఎంపీపీ ఎస్‌ఆర్‌ సుమ కలెక్టర్‌, ఉమ్మడి అనంతపురం జెడ్పీ సీఈఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారిక రికార్డులను తారుమారు చేసి, సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఎంపీపీ వెంట జెడ్పీటీసీ అనంతరాజు, న్యాయవాది రంగనాథ్‌, నాయకులు భోజేగౌడ, నాగరాజు, మంజునాథ్‌, యరగుంటప్ప తదితరులు

ఎమ్మెల్యే చెప్పలేదు.. సమావేశం జరపలేదు

సాధారణంగా సాధారణ మండల సర్వసభ్య సమావేశం 90 రోజుల్లోపు జరపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో చివరి సారిగా ఈ ఏడాది మే 5న మండల మీట్‌ జరిగింది. నేటికి 141 రోజులు గడుస్తున్నా... మండల సమావేశం నిర్వహించలేదు. ఈ విషయాన్ని పలుమార్లు ఎంపీపీ ఎస్‌ఆర్‌ సుమ ఎంపీడీఓ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన స్పందించలేదు. పైగా ‘‘నాకు ఎమ్మెల్యే చెప్పలేదు..అందుకే సమావేశం జరపడం లేదు’’ అని సమాధానమివ్వడం చూసి అక్కడున్న అధికారులే ముక్కున వేలేసుకున్నారు.

16వ ఆర్థిక సంఘం నిధుల

స్వాహాకు ఎంపీడీఓ ప్లాన్‌

ఉన్నతాధికారులకు

ఫిర్యాదు చేయనున్న ఎంపీపీ సుమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement