పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో వరుసగా రెండో రోజూ జిల్లాలోని 18 మండలాల పరిధిలో వర్షం కురిసింది. సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కొత్తచెరువులో మండలంలో 105.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక కొత్తచెరువు మండలంలో 105.6 మి.మీ, గోరంట్ల 68.2, గుడిబండ 34.2, బుక్కపట్నం 25.8, తాడిమర్రి 14.4, పుట్టపర్తి 11.8, ముదిగుబ్బ 6.2, అగళి 6.2, బత్తలపల్లి 4.2, రామగిరి 4.2, సీకేపల్లి 3.6, సోమందేపల్లి 3.2, అమరాపురం 2.8, తలుపుల 2.0, పెనుకొండ 2.0, మడకశిర, హిందూపురం, లేపాక్షి మండలాల్లో 1.8 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు వెల్లడించారు.


