ఇంకెన్నాళ్లీ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లీ కష్టాలు

Sep 21 2026 6:59 AM | Updated on Sep 21 2026 6:59 AM

స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లవుతున్నా మా తలరాతలు మాత్రం మారడం లేదు. మా గ్రామం ఓ చిన్న ద్వీపకల్పంలా ఉంది. వర్షాకాలం వస్తే కంటిమీద కనుకు ఉండదు. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడి వెళ్లాలో అర్థం కాదు. పొరుగు ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఇంకెన్నాళ్లీ కష్టాలు పడాలి? మాకు మోక్షం ఎప్పుడు లభిస్త్తుంది.? జిల్లా కలెక్టర్‌ స్పందించి అపరిష్కృతంగా ఉన్న బ్రిడ్జిల సమస్య పరిష్కరించాలి.

– గలిబే అనిల్‌కుమార్‌, హనకనహళ్‌

ఒక్క బ్రిడ్జినైనా నిర్మించండి

సొల్లాపురం మార్గంలో రెండు వంకలుంటే... బెళుగుప్ప మార్గంలో ఒక వంక మాత్రమే ఉంది. దయనీయ పరిస్థితులను అనుభవిస్తున్న గ్రామాన్ని పాలకులు పట్టించుకోవడంలేదు. కనీసం ఒక వంకౖపైనెనా బ్రిడ్జి కడితే మా ఊరికి మోక్షం లభించినట్లే. ఒక బ్రిడ్జి నిర్మాణానికై నా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ బ్రిడ్జి నిర్మిస్తే మా గ్రామానికి కుడివైపునున్న బెళుగుప్ప కై నా వెళ్లగలుగుతాం. జలదిగ్బంధం నుంచి బయటపడుతాం. – శివరాజ్‌, హనకనహళ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement