యాడికి: మండలంలోని భోగాలకట్ట గ్రామంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలరు మట్టి మిద్దె కూలి అశ్వర్థమ్మ (80) మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన దిద్దే కుంట అశ్వర్థమ్మ, దిద్దేకుంట నారాయణ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. నారాయణరెడ్డితోపాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు మృతి చెందగా.. కోడలు కృష్ణవేణి తన ఇద్దరు కుమారులతో కలిసి గ్రామంలో వేరుగా ఉంటోంది. అయితే వృద్ధురాలు అశ్వర్థమ్మ పాడుబడిన సొంతింటిలోనే తలదాచుకునేది. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు ఇంటి మట్టి గోడలు, దూలాలు కుప్పకూలాయి. శిథిలాల కింద నలిగి అశ్వర్థమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ గోపాలుడు, వీఆర్‌ఓ రంగస్వామి తదితరులు మృతి చెందిన అశ్వర్థమ్మను శిథిలాల నుంచి వెలికితీశారు. డీటీ శ్రీనివాసులు మృతురాలి అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఆమె కోడలు కృష్ణవేణికి అందించారు.
బోగాలకట్టలో విషాదం


