తాగునీటి సమస్యలు తలెత్తనీయొద్దు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యలు తలెత్తనీయొద్దు

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

గుడిబండ: గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తనీయొద్దని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కేకాతి గ్రామ సమీపంలోని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం వాటర్‌ ట్యాంకులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని వందలాది గ్రామాలకు తాగునీరు అందించే అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో నీలకంఠాపురం శ్రీరామరెడ్డి పథకం ఒకటన్నారు. ఈ పథకం ద్వారా గ్రామ ప్రజలకు తాగునీరు సక్రమంగా అందించాలని అధికారులకు సూచించారు. రోజూ గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులను పూర్తి స్థాయిలో నిండేలా చూడాలన్నారు. ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత జలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కేశవరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే ఇంటికే

అమరాపురం: అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ హెచ్చరించారు. శనివారం మండల పరిధిలోని హలుకూరు సమీపంలో ఉన్న శ్రీరామరెడ్డి మంచినీటి పథకం ట్యాంకును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాల కోసం మంచినీటిని అందించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. రికార్డులో నమోదు సక్రమంగా చేయలేదని, సంబంధిత అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య మరోసారి తీవ్రంగా ఉన్నట్లు తన దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ మనూనాయక్‌, ఎంపీడీఓ రామరావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement