వృద్ధురాలి బంగారు కమ్మలు అపహరణ | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి బంగారు కమ్మలు అపహరణ

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

నల్లచెరువు: ఇంటి ముంగిట వృద్ధురాలు ఒంటరిగా కూర్చున్న విషయాన్ని గమనించిన గుర్తు తెలియని దుండగులు.. ఆమైపె పైపులకు వాడే గమ్‌ను చల్లి చెవులకు ఉన్న బంగారు కమ్మలను బలవంతంగా లాక్కెళ్లిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. నల్లగుట్టవీధిలో వెంకటలక్ష్మమ్మ భర్త శివారెడ్డి చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది. అయితే శుక్రవారం సాయంత్రం వెంటలక్ష్మమ్మ తన ఇంటి ముందు ఒంటరిగా కూర్చున్న విషయం గుర్తు తెలియని వ్యక్తులు గమనించారు. ఇదే అదునుగా చూసి పైపులకు అతికించడానికి వాడే గమ్‌ను వృద్ధురాలు ముఖంపై చల్లి.. ఆమె చెవుల్లోని బంగారు కమ్మలను బలవంతంగా లాక్కుని పరారయ్యారు. దుండగుల దాడిలో వృద్ధురాలి రెండు చెవులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంకటలక్ష్మమ్మను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement