బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చర్యలు

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

చిలమత్తూరు: బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని కార్మికశాఖ సహాయ కమిషనర్‌ సూర్యనారాయణ, ఎస్‌ఐ శ్రీధర్‌ హెచ్చరించారు. బాల కార్మిక నిరోధక టాస్క్‌ఫోర్స్‌ బృందం శుక్రవారం దుకాణాలు, హోటళ్లు, డాబాలు, గ్రానైట్‌ పరిశ్రమల్లో తనిఖీ నిర్వహించింది. అధికారులు మాట్లాడుతూ చదువుకునే వయస్సులో వారిని పనులకు పంపించి, వారి జీవితాలను నాశనం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో హిందూపురం లేబర్‌ అధికారి రమణారెడ్డి, ధర్మవరం సహాయ కార్మిక అధికారి నరేష్‌కుమార్‌, ఐసీడీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్‌దాఘాతంతో

ఆవులు మృతి

పుట్టపర్తి అర్బన్‌: మండలంలోని వీరజిన్నయ్యపల్లిలో ఓ రైతు కుటుంబానికి చెందిన రెండు పాడి ఆవులు విద్యుదాఘాతంతో శుక్రవారం మృతిచెందాయి. పాడి రైతు ఇడుగుట్టు లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు.. ఇంటి సమీపంలో ఓ విద్యుత్‌ స్తంభానికి వీధిలైట్లకు అమర్చిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది. దాని సమీపంలోనే రోజూలాగే పాడి ఆవులను పొలానికి అమర్చిన కంచెకు కట్టి వేశారు. రాత్రి పొద్దుపోయాక గ్రామంలో వర్షం కురిసింది. దీంతో ఇనుప కంచెకు విద్యుత్‌ ప్రసరించి, కట్టేసిన ఆవులు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. సుమారు రూ. లక్ష నష్టపోయినట్లు బాధితుడు ఆవేదన చెందాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు దంపతులు కోరారు.

తాగునీటి సమస్య తీర్చండి

గుడిబండ: మండలంలోని మద్దనకుంటలో తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో గుడిబండ, మోరబాగల్‌ రహదారిపై బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. మహిళలు మాట్లాడుతూ కొన్ని రోజులుగా గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు విన్నపించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు బావులకు విద్యుత్‌ సమస్యతో తాగునీటికి తీవ్ర ఎదుర్కొంటున్నామన్నారు. ఉన్నత అధికారులు గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని గ్రామ ప్రజలు కోరారు.

జూదరుల అరెస్ట్‌

మడకశిరరూరల్‌: మండలంలోని అగ్రంపల్లి సమీపంలో జూద కేంద్రంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.80 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వివాహిత ఆత్మహత్య

గార్లదిన్నె: బూదేడుకు చెందిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన అనూష (30) గత బుధవారం ఇంటి వద్ద విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉండగా ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. మృతు రాలికి కొడుకు,కుమార్తె ఉన్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

వీవర్స్‌ కాలనీలో

వివాహిత మృతి

కదిరి టౌన్‌: మున్సిపల్‌ పరిధిలోని వీవర్స్‌కాలనీకి చెందిన వివాహిత గౌతమి (27) శుక్రవారం రాత్రి మృతి చెందింది. వివరాలు.. బెంగళూరు నుంచి గౌతమి దంపతులు వినాయక చవితికి పుట్టినిళ్లు అయిన కదిరి వీవర్స్‌కాలనీకి వారం క్రితం వచ్చారు. అయితే శుక్రవారం రాత్రి గౌతమి వినాయకుడి వద్ద ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఇంటికి వెళ్లింది. గౌతమి కళ్లు తిరిగినట్లు ఉందని చెప్పడంతో ఆమె భర్త సతీష్‌నాయుడు, బంధువులు కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే వైద్యం అందిస్తుండగా మృతి చెందినట్లు అవుట్‌ పోస్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. గౌతమి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement