తాగుడు తెచ్చిన తంటా | - | Sakshi
Sakshi News home page

తాగుడు తెచ్చిన తంటా

Sep 19 2026 8:38 AM | Updated on Sep 19 2026 8:38 AM

పరువు తీస్తున్నాడని తండ్రిపై

మచ్చుకత్తితో దాడి

ధర్మవరం రూరల్‌: ఊరూరా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేసి మద్యం ఏరులై పారిస్తున్న చంద్రబాబు సర్కార్‌...ప్రజలను వ్యసనపరులను చేసి కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. మద్యం సేవించి వస్తూ తల్లిని కొడుతుండటంతో పాటు ఊళ్లో వారితో తరచూ గొడవ పడుతూ పరువు తీస్తున్నాడని ఓ కుమారుడు తండ్రినే మచ్చుకొడవలితో నరికాడు. ఈ ఘటన శుక్రవారం ధర్మవరం మండలం నేలకోట తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నేలకోట తండాకు చెందిన వడిత్యా కృష్ణానాయక్‌ తరచూ మద్యం సేవించి గ్రామస్తులతో గొడవపడేవాడు. ఇది మంచి పద్ధతి కాదని భార్య ఆదిబాయి నచ్చజెప్పేది. తనకే నీతులు చెప్పుతావా? అంటూ ఆమైపెనే దాడి చేసేవాడు. వంట మనిషిగా చేస్తూ ఇతర ప్రాంతంలో ఉన్న కుమారుడు రఘునాయక్‌కు ఈ విషయం తెలిసింది. శుక్రవారం ఇంటికి వచ్చిన కుమారుడు రఘునాయక్‌ తండ్రితో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన రఘునాయక్‌.. ఇంట్లో ఉన్న మచ్చుకత్తితో తండ్రిపై దాడి చేసి తలపై నరికాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణానాయక్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. దాడికి పాల్పడిన రఘునాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, కుమారుడిపై తండ్రి పోలీసులకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది.

హెచ్చెల్సీలో వ్యక్తి గల్లంతు

కణేకల్లు: మండలంలోని యర్రగుంట శివారులో హెచ్చెల్సీలో ఈత కొడుతూ గురుస్వామి (42) నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యర్రగుంటలో బుధవారం వినాయక నిమజ్జనం జరిగింది. గురుస్వామి నిమజ్జనం వేడుకలో పాల్గొన్నాడు. అయితే నిమజ్జనంలో పాల్గొన్నవారంతా వెళ్లిపోయారు. ఈతలో ఆరితేరిన గురుస్వామి కాలువలో స్నానానికి దిగాడు. కొదిసేపు ఈత కొట్టాడు. ఈక్రమంలో కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. రెండ్రోజులైనా గురుస్వామి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారందరినీ విచారించారు. చివరికి ఆయన గల్లంతయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరోవైపు గురుస్వామి మృతదేహం కోసం కాలువ వెంబగడి గాలించినా ఆచూకీ లభించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement