పుట్టపర్తి శోభాయాత్రలో చిందులు వేస్తున్న యువకులు
‘గణేష్ మహరాజ్‌కి జై’ అంటూ యువకులు సందడి చేశారు. రంగులు చల్లుకుంటూ ఉత్సాహంతో ఆడిపాడారు. ‘‘జైజై గణేశా.. జై కొడతా గణేశా’’ అంటూ నృత్యాలతో హోరెత్తించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం అట్టహాసంగా సాగింది. డప్పు దరువుతో పిల్లా పెద్ద చిందులు వేస్తూ గౌరీ పుత్రున్ని గంగ ఒడికి చేర్చారు. పలుచోట్ల అన్నదానం చేశారు. లడ్డూ వేలం పాటలు ఆసక్తిగా సాగాయి. మరోవైపు ప్రశాంతి నిలయంలోని సత్యసాయి విద్యా, వైద్య, ట్రస్ట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను బుధవారం సత్యసాయి మహాసమాధి చెంత ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి సాహెబ్ చెరువు, బుక్కపట్నం చెరువుల్లో నిమజ్జనం చేశారు.
– పుట్టపర్తి టౌన్/ప్రశాంతి నిలయం:


