ఆర్టీసీ బస్సు నుంచి పొగలు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు నుంచి పొగలు

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

హిందూపురం టౌన్‌: కదిరి నుంచి హిందూపురం వస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో వెనుక టైర్‌ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. ఈ ఘటన పట్టణంలోని మేళాపురం సర్కిల్‌ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కదిరి నుంచి హిందూపురం వస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు స్థానిక మేళాపురం సర్కిల్‌ వద్ద ప్రయాణికులను దింపడానికి నిలిపింది. ఆ సమయంలో బస్సు వెనుక చక్రం వద్ద నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బస్సు దిగిపోయారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డిపో అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బ్రేక్‌ లైనర్లు ఒకదానిపై ఒకటి రాపిడికి గురికావడంతో వేడి పెరిగి పొగలు వచ్చినట్లు తెలిపారు. అనంతరం బస్సును డిపో వద్దకు తరలించి పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

‘ప్రత్యామ్నాయ’ విత్తనాలు సిద్ధం

పుట్టపర్తి అర్బన్‌: ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీపై అందజేయడానికి సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి క్రిష్ణయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 80 శాతం రాయితీతో ఉలవ, పెసర, అలసంద, జొన్నలను అందజేయనున్నట్లు తెలిపారు. పొలాలను ఖాళీగా ఉంచకుండా పంటలను సాగు చేయాలన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఇప్పటికే ఉలవలను సిద్ధంగా ఉంచామన్నారు. ఇప్పటి వరకూ సాగు చేసిన పంటలు, రైతుల వివరాలు ‘ఈ– పంట’లో 95 శాతం నమోదయ్యాయన్నారు. రైతులు ఏ పంటకు బీమా చెల్లించారో అదే పంటకు బీమా వర్తిస్తుందన్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,97,518 హెక్టార్లు ఉండగా ప్రస్తుతానికి 1,16,099 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారన్నారు. వేరుశనగ 46,470 హెక్టార్లు, కంది 35,949, మొక్కజొన్న 15,296, ఆముదం 6,633, వరి 5,981 హెక్టార్లలో సాగు చేశారన్నారు. 81,419 హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉందన్నారు. ప్రతి ఎకరాలో పంట సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement