ఇంజినీర్లకు స్ఫూర్తిప్రదాత ‘మోక్షగుండం’ | - | Sakshi
Sakshi News home page

ఇంజినీర్లకు స్ఫూర్తిప్రదాత ‘మోక్షగుండం’

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

అనంతపురం న్యూ టౌన్‌: భారతరత్న సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్లకు స్ఫూర్తి ప్రదాత అని పంచాయతీ రాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) బాలు నాయక్‌ అన్నారు. నగరంలోని పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ కార్యాలయంలో మంగళవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతిని పురస్కరించుకుని 59వ ఇంజినీర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ వై. చిన్న సుబ్బరాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బాలు నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత, నిజాయతీలే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను భారతరత్నను చేశాయన్నారు. పీఆర్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ చిన్న సుబ్బరాయుడు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతీయుల హృదయాల్లో చిరస్మరణీయుడన్నారు. ఇంజినీర్లు రాజకీయ నేతల వలలో చిక్కుకోకూడదని పలువురు రిటైర్డ్‌ ఇంజినీర్లు అభిలషించారు. అంతకుముందు పీఆర్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు ఇంజినీర్లను సన్మానించారు.

డివిజనల్‌ ఇంజినీర్లు కే.లక్ష్మీనారాయణ (సబ్‌ డివిజన్‌–1, అనంతపురం), రమణ (పెనుకొండ), వెంకటేష్‌ (మడకశిర), నాగేంద్ర కుమార్‌ (కళ్యాణదుర్గం), అసిస్టెంట్‌ ఇంజినీర్లు ఓబులేసు, అబ్దుల్‌ ఖాదర్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ చరణ్‌ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మురళీమోహన్‌, రాజన్న, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈఎన్‌సీ బాలు నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement