గుంతకల్లు: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు ఉద్యోగులకు మంగళవారం డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డులను అందజేశారు. మంగళవారం డీఆర్‌ఎం కార్యాలయంలోని తుంగభద్ర ఛాంబర్‌లో డివిజన్ వ్యాప్తంగా ఎంపికై న 13 మంది అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం సీఎస్ గుప్తా మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి నిబంధనల ప్రకారం నడుచుకుంటూ పని చేస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. దీంతో పాటు రైల్వే అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. అవార్డులు అందుకున్న వారిలో తాడిపత్రికి చెందిన సంతోష్‌సింగ్, గుంతకల్లుకు చెందిన జ్ఞానేశ్వర్‌రావు, ఎం.సుధాకర్, ఎం.రాము, శివప్రసాద్, సాకేబండ రఫీ, ఫకృధ్దీన్ (కొండాపురం), టీ.వేమరెడ్డి (గుత్తి), ఎండీ సాహెబ్ (తిమ్మనచర్ల), సరనేష్‌మీనా (జక్కలచెరువు), ప్రిన్‌కుమార్ సింగ్ (గంగయ్యపాళెం), రాజేష్‌కుమార్ (తిమ్మనచర్ల) ఉన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


