‘కూటమి’ పతనానికి నాంది పలుకుదాం | - | Sakshi
Sakshi News home page

‘కూటమి’ పతనానికి నాంది పలుకుదాం

Sep 13 2026 9:16 AM | Updated on Sep 13 2026 9:16 AM

ధర్మవరం: ‘‘ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టింది...సంక్షేమానికి నీళ్లొదిలింది. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాక్షస పాలన సాగిస్తోంది.. అవినీతి, అక్రమాలే పరమావధిగా సాగుతున్న ఈ ప్రభుత్వ పతనానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో నాంది పలుకుదాం’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు నార్పల సత్యనారాయణరెడ్డితో పాటు నియోజకవర్గ స్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ... పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పూర్తి స్వేచ్స్‌చ్చారని, స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థిని నాయకులు, కార్యకర్తలే ఎంపిక చేసుకుని రమ్మని చెప్పారన్నారు. అందరం కలిసి అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు త్వరలో జర గబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణంలోని 48 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించేలా సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 110 క్లస్టర్లలో నాయకులు నూతన కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. సంక్షేమం లేదు...అభివృద్ధి లేదన్నారు. ఉన్నదల్లా కేవలం అవినీతి, కూటమి నాయకులు దోచుకోవడం దాచుకోవడం మాత్రమేనన్నారు. ఈ అవినీతి కార్యకలాపాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం ఇటీవల రెడ్‌బుక్‌ పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల మీద అక్రమ కేసులు, బైండోవర్‌లు, వేధింపులతో రాక్షస ఆనందం పొందుతోందని, జగనన్న 2.0లో రెట్టింపు ప్రతి చర్యను వారు చవిచూస్తారని కేతిరెడ్డి తెలిపారు. కూటమి నాయకులు భవిష్యత్‌ను సిరాతో రాయాలనుకుంటే తాను సిరాతోనే బదులిస్తానని, రక్తంతో రాయాలనుకుంటే రక్తంతోనే బదులిస్తానన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చిన... కేతిరెడ్డి ముందుంటాడన్న విషయాన్ని కూటమి నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో ఉన్న అన్ని మండాలల్లో సమావేశం పెట్టుకుని కార్యకర్తల సమస్యలు తెలుసుకుని స్థానిక సంస్థల్లో గెలుపే పరమావధిగా దిశా నిర్దేశం చేస్తానన్నారు.

సమష్టి కృషితోనే విజయం సాధ్యం

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకుడు నార్పల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాలు, నూతన కమిటీల ఏర్పాటులో 14వేల పైచిలుకు బలమైన నాయకులను అందించి రాష్ట్రంలోనే ధర్మవరం మొదటి స్థానంలో ఉందన్నారు. అందరూ కలిసి సమష్టిగా కృషి చేస్తే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరుమీద నడకేనన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధి, నియోజకవర్గంలో కేతిరెడ్డి చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు. పార్టీలో కార్యకర్తలే మూల స్తంభాలని, రానున్న కాలంలో కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. సమావేశంలో నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో పాటు పార్టీ అనుబంధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో

మన సత్తా చాటుదాం

నాయకులు, కార్యకర్తలు

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి,

పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి పిలుపు

ధర్మవరంలో

నియోజకవర్గస్థాయి సమావేశం

భారీగా తరలివచ్చిన

వైఎస్సార్‌సీపీ శ్రేణులు

కార్యకర్తలకు అండగా ఉంటాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement