హిందూపురం టౌన్: పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆవరణలోని ఎంసీహెచ్ భవనంపై నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను శనివారం ప్రారంభించారు. విజయవాడ నుంచి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జగదీష్ ప్రసాద్ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సత్యప్రసాద్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీకాంతి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆఫ్తాబ్ పాల్గొన్నారు. ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ద్వారా అత్యవసర వైద్య సేవలు స్థానికంగా అందుబాటులోకి వస్తాయన్నారు. దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, గుండె సంబంధిత, శ్వాసకోస సమస్యలకు రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణమే అత్యుత్తమ వైద్యసేవలు అందించే వీలుంటుందన్నారు.
పరికరాలు, సిబ్బంది ఎక్కడ..?
ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన క్రిటికల్ కేర్ యూనిట్‌కు కావాల్సిన పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది మాత్రం నియమించలేదు. కేవలం భవనాన్ని మాత్రమే ప్రారంభించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2024 ఫిబ్రవరి 25న శంకుస్థాపన చేసిన క్రిటికల్‌కేర్ యూనిట్ భవనాన్ని మాత్రం ఇప్పటికి పూర్తి చేశారని, పరికరాలు, సిబ్బందిని నియమించి పూర్తి స్థాయిలో క్రిటికల్ కేర్ యూనిట్‌ను ఇంకెప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్రమంత్రి


