మౌలిక వసతుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల పరిశీలన

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

అగళి: మండల పరిధిలోని నరసంబూది గ్రామంలో గురువారం జిల్లా గ్రామ పంచాయతీ అధికారి సమత పర్యటించారు. జాతీయ మహిళా ఫ్రెండ్లీ ప్రోగ్రామ్‌కు నరసంబూది పంచాయతీ ఎంపిక కావడంతో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామంలోని మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం జాతీయ మహిళా ఫ్రెండ్లీ ప్రోగ్రామ్‌, గ్రామసభ తదితర వాటిపై అధికారులతో చర్చించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు డ్రైనేజీలు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలన, మహిళలు, బలహీన వర్గా అభ్యున్నతి తదితర వాటిపై చేపట్టబోయే కార్యాచరణపై మాట్లాడారు. ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ కార్యక్రమం కింద అభివృద్ధి పనులకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు అందించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీడీఓ పెనుగొండ తేజోష్ణ , డీఎల్‌పీఓ శివనారాయణరెడ్డి, ఎంపీడీఓ నరేష్‌, గంగధర్‌, ఇన్‌చార్జ్‌ సీడీపీఓ రాధ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ లీలావతి, డెప్యూటీ ఎంపీడీఓలు రెడ్డి ప్రకాష్‌, పద్మ, మండల వ్యవసాయ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement