హిందూపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత మద్యం షాపుల లైసెన్సులను మరో సంవత్సరం పాటు రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని, అందువల్ల మద్యం షాపుల లైసెన్సుదారులు తమ షాపులను రెన్యూవల్ చేసుకోవాలని అనంతపురం జిల్లా ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్‌కేడీవీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో స్థానిక సీఐ లక్ష్మీదుర్గయ్యతో కలిసి పట్టణంలో మద్యం షాపు లైసెన్సుదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మద్యం షాపుల రెన్యూవల్‌కు సంబంధించి విధి విధానాలను ఆయన వివరించారు. ఒకవేళ మద్యం షాపులను రెన్యూవల్ చేసుకోకపోతే ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాల మేరకు ఆ షాపును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో మద్యం షాపుల లైసెన్సుదారులు, సిబ్బంది పాల్గొన్నారు.


