ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలని భావిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం దోపిడీనే పరమాధిగా భావిస్తోంది. చివరకు డబ్బు కోసం రైతులకు తీరని అన్యాయం చేస్తూ హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టింది. రైతుల తరఫున పోరాడిన మాలాంటి వారందరిపై అక్రమ కేసులు పెట్టింది. గ్రామాల్లో వలసలు మొదలయ్యాయి. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే స్థానిక సంస్థల్లో మనం విజయఢంకా మోగించాలి.
– తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త


