గుత్తి: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌ఎస్ కేపీఎస్ వెంచర్‌లో మళ్లీ దొంగతనం జరిగింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి దక్షణామూర్తి ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన కొంత నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి కూడా దొంగలు హల్ చల్ చేశారు. దొంగలు హల్ చల్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ముగ్గురు దొంగలు ముసుగు ధరించి ఒకే దుస్తుల్లో చోరీకి వచ్చారు. చేతుల్లో ఇనుప రాడ్లు పట్టుకున్న దృశ్యాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాలనీవాసులే చందాలు వేసుకుని నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నా దొంగలు రెచ్చిపోతుండటం కలకలం రేపుతోంది. ఇదే కాలనీలో సీఐ రామారావు, ఎస్‌ఐ అమీర్ ఖాన్ కూడా నివాసముంటున్నారు. పోలీసులు నివాసముండే ప్రాంతమైనా చోరీలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు.


