● వ్యక్తికి తీవ్ర గాయాలు
అగళి: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాలమేరకు.. పి.బ్యాడేగర్ గ్రామానికి చెందిన మంజునాథ్ ద్విచక్ర వాహనంలో జాతీయ రహదారి దాటే క్రమంలో మడకశిర వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొంది. ఘటనలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న మంజునాథ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స చేయాడానికి వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సిబ్బందిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏమైనా ప్రమాదాలు జరినప్పుడు కూడా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రమాదం జరిగినా కర్ణాటక రాష్ట్రంలోని శిర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మెరుగైన వేద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.


