ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

ధర్మవరం రూరల్‌: మండల పరిధిలోని పోతుకుంట గ్రామ నడిబొడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయానికి ఉన్న తాళాలను ఆక్సాబ్లేడుతో కట్‌ చేసి దొంగలు లోపలికి ప్రవేశించారు. స్వామి వారికి అలంకరించిన సుమారు మూడు కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారని గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడే ఉన్న హుండీ పగులగొట్టే ప్రయత్నం చేసినా అది తెరుచుకోకపోవడంతో అలాగే వదిలివేశారు. గ్రామ నడిబొడ్డున ఉన్న ఆలయంలో చోరీ జరగడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ ప్రభాకర్‌ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

విరాళాలు అందజేత

తలుపుల: మండలంలోని గంజివారిపల్లి అభయాంజనేయస్వామి ఆలయాభివృద్ధి పనులకు రూ.లక్ష విరాళాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు వివేకానందరెడ్డికి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ డీకే బాబు శుక్రవారం అందజేశారు. అలాగే కుమ్మరపేట రామాలయానికి రూ.లక్ష, ఎగువపేట వినాయక మండపానికి రూ.50 వేలు విరాళం అందజేసినట్టు ఆయా గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు డీకే బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement