పుట్టపర్తి టౌన్: కెనరాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, బ్యూటీపార్లల్‌పై నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శాంతిప్రియ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలలకు పుట్టపర్తి సమీపంలో బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న కెనరాబ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈనెల 15 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్, రేషన్‌కార్డు, నాలుగు పాస్ ఫొటోలు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, తమ విద్యార్హత సర్టిఫికెట్లను జిరాక్స్ తీసుకొని బ్రాహ్మణపల్లిపల్లి వద్ద కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈఅవకాశాన్ని గ్రామీణా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8977718982, 9391486269, 08555–286427 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
జూదరుల అరెస్టు
ధర్మవరం: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్జీఓ హోంపై పట్టణ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.59,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ రెడ్డప్ప పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.


