శింగనమల చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

శింగనమల చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

Sep 5 2026 7:31 AM | Updated on Sep 5 2026 7:31 AM

రక్షించిన స్థానికులు

శింగనమల: అనారోగ్యంతో కుటుంబ సభ్యులకు భారం కాకూడదని భావించిన ఓ మహిళ శింగనమల చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే అక్కడే రోడ్డు పనులు చేస్తున్న వారు గుర్తించి ఆమెను రక్షించారు. పోలీసుల వివరాల మేరకు... తాడిపత్రి గన్నెవారిపల్లి కాలనీకి చెందిన లక్ష్మీదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు షుగర్‌, పెరాల్సిస్‌ ఉండడంతో, కుటుంబ సభ్యులకు భారమవుతానని భావించి శింగనమల మరువకొమ్మ క్రాస్‌కు బస్సులో వచ్చారు. అక్కడ బస్సు దిగి చెరువులోకి దూకింది. అయితే అక్కడే దగ్గరలో రోడ్డు పనులు చేస్తున్న కార్మికులు , రోడ్డు మీద ఉన్న ప్రయాణికులు వెంటనే ఆమెను కాపాడి చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. ఏఎస్‌ఐ అశోక్‌కుమార్‌ సిబ్బందితో అక్కడికి వెళ్లి లక్ష్మీదేవిని పోలీస్‌సేష్టన్‌కు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల వివరాలు కనుక్కొని వారిని పిలిపించి జాగ్రత్తగా చూసుకోవాలని మందలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement