విధుల్లో అలసత్వాన్ని సహించం | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అలసత్వాన్ని సహించం

Aug 1 2026 1:37 AM | Updated on Aug 1 2026 1:37 AM

పుట్టపర్తి టౌన్‌: విధుల్లో అలసత్వాన్ని ఏ స్థాయిలోనూ సహించబోనని ఎస్పీ సతీష్‌కుమార్‌ హెచ్చరించారు. ముఖ్యంగా ఎస్కార్ట్‌ డ్యూటీలకు వెళ్లే ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్‌) పోలీసులు నిబంధన మేరకు నడుచుకోవాలన్నారు. శుక్రవారం స్థానిక పరేడ్‌ మైదానంలో ఏఆర్‌ సిబ్బంది నిర్వహిస్తున్న పరేడ్‌ను పరిశీలించి భద్రతకు సంబంఽధించిన పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... విధుల్లో ఎప్పుడూ రాజీ పడకూడనన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. పోలీసు సంక్షేమానికీ తగు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరికై నా వ్యక్తిగత సమస్యలు ఉంటే నేరుగా తనను కలిసి చెప్పుకోవచ్చన్నారు. రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మహేష్‌, వలి, ఉమామహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు వీరన్న, ప్రసాద్‌, కృష్ణానాయక్‌,తోపాటు ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

రొద్దం: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్‌కుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ఆయన రొద్దం మండల పరిధిలోని తురకలాపట్నం గ్రామంలో పర్యటించారు. సివిల్‌ రైట్స్‌ డే సందర్భంగా గ్రామస్తులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేరాల నియంత్రణకు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం పోక్సో, సైబర్‌ నేరాలు... ముందస్తు జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు పడే శిక్షలు వివరించారు.

ఏఆర్‌ పోలీసులను హెచ్చరించిన ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement