నాడు ఆదర్శం.. నేడు అధ్వానం | - | Sakshi
Sakshi News home page

నాడు ఆదర్శం.. నేడు అధ్వానం

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

పుట్టపర్తి టౌన్‌: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 2020లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ఏర్పాటు చేశారు.వ్యవసాయం, పట్టు, పాడి, పశుపోషణ, మత్స్య, ఉద్యాన, మార్కెటింగ్‌, ఏపీఎంఐపీ తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రైతులను ఆదుకున్నారు. ‘విత్తు నుంచి విపత్తు వరకు’ నినాదంతో పక్కాగా ప్రణాళికలు అమలు చేస్తూ అడుగడుగునా అన్నదాతలకు అండగా నిలిచారు. అప్పట్లో ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందుతున్న సేవలను దేశంలో ఉన్న పలు రాష్ట్రాల ప్రతినిధులు, అలాగే విదేశీ బృందాలు పరిశీలించి ప్రశంసలు గుప్పించారు.

చంద్రబాబువన్నీ ప్రగల్బాలే..

చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన ప్రభుత్వం ఆర్‌బీకేలను ఆర్‌ఎస్‌కేలుగా పేరు మార్చేసింది. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ఆర్‌ఎస్‌కేలను నిర్వీర్యం చేస్తోంది. ఏడాది క్రితం హేతుబద్ధీకరణ పేరుతో ఆర్‌ఎస్‌కేల సంఖ్యను తగ్గించేసింది. గతంలో విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు, రైతు భరోసా, పీఎం కిసాన్‌, పశువుల మందులు, ఈ–క్రాప్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌, పావలా వడ్డీ, సున్నా వడ్డీ... ఇలా రైతులకు సంబంధించి ఏది కావాలన్నా అక్కడికి వెళితే తెలిసేవి. దీంతో రైతులతో ఆర్‌బీకేలు కళకళలాడేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రైతులు పెద్దగా అటువైపు వెళ్లడం లేదు. రెండేళ్లు తిరగకుండానే పరిస్థితి ఒక్కసారిగా తలకిందులు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంపై మండిపడుతున్నారు.

జగన్‌ హయాంలో రైతులకు

విశిష్ట సేవలందించిన ఆర్బీకేలు

అధికారంలోకి వచ్చాక అధ్వానంగా మార్చిన చంద్రబాబు ప్రభుత్వం

హేతుబద్ధీకరణ పేరుతో

రైతు సేవలకు కత్తెర వేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement