అధిక జ్యేష్టం, ఆషాఢం, అన్‌సీజన్ కారణంగా పట్టుచీరల అమ్మకాలు బాగా తగ్గాయి. 4 నెలలుగా ఇదే పరిస్థితి. ప్రభుత్వం సొసైటీల ద్వారా అన్‌సీజన్‌లో పట్టు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు పరిశ్రమల శాఖ నుంచి రాయితీ రుణాలిస్తే వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే చేనేత కార్మికులకు ముడిపట్టు రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పట్టుచీరల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.
– రంగన శ్రీనివాసులు,
పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం
వ్యాపారం బాగా తగ్గింది
పట్టుచీరల వ్యాపారం బాగా తగ్గింది. చేనేత సంక్షోభం కారణంగా పట్టుచీరల ఉత్పత్తి కూడా తగ్గింది. అన్‌సీజన్ కారణంగా రూ.లక్షల పెట్టుబడి స్తంభించిపోతోంది. దీనికి తోడు షోరూం నిర్వాహకులు డిస్కౌంట్ సేల్‌తో ఇస్టానుసారం చీరల ధరలు తగ్గిస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – రవితేజారెడ్డి,
పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం


