ప్రశాంతి నిలయం: భక్తులకు అండగా నిలిచి అభయమిచ్చిన సత్యసాయిని వర్ణిస్తూ యువత నిర్వహించిన ‘వై ఫియర్ వెన్ అయాం హియర్’ నృత్య రూపకం భక్తులను రంజింపజేసింది. పర్తి యాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన సౌతాఫ్రికా భక్తులు గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సత్యసాయి నేనున్నానంటూ ప్రపంచం నలు మూలలా ఉన్న భక్తులకు అభయమిస్తూ వారిని ముందుకు నడిపారన్న సందేశాన్ని ఇస్తూ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌కు చెందిన యూత్ బృందం సాంస్కృతిక నృత్య రూపకం నిర్వహించింది. అభాగ్యులకు అండగా నిలిచేందుకు సత్యసాయి చేపట్టిన గ్రామ సేవ, విద్య , వైద్య, సేవా కార్యక్రమాలను యువత చక్కగా వివరించారు. మానసికంగా కృంగిపోయిన ఎందరో...సత్యసాయి బోధనలతో చైతన్యవంతులై తమ జీవితాలను చక్కగా తీర్చి దిద్దుకున్న తీరును ప్రదర్శించారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు.
ఆకట్టుకున్న చిన్నారుల నృత్యరూపకం
సత్యసాయి సేవలను వివరిస్తూ
సాగిన ప్రదర్శన


