యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

యువకుడి బలవన్మరణం

Mar 4 2026 7:30 AM | Updated on Mar 4 2026 7:30 AM

హిందూపురం: స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలోని దేవరపల్లి వద్ద రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని రాజస్తాన్‌కు చెందిన చంద్రబాన్‌ (28)గా నిర్ధారించుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బతుకు తెరువు కోసం కర్ణాటకలోని తుమకూరుకు చేరుకున్న చంద్రబాన్‌ అక్కడ టైల్స్‌ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. బెంగళూరు మీదుగా స్వస్థలానికి వెళుతున్న అతను మంగళవారం దేవరపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో రైల్వే పోలీసులు నిర్ధారించి, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement