వాహనంలో నుంచి కిందపడిన కూలీలు | - | Sakshi
Sakshi News home page

వాహనంలో నుంచి కిందపడిన కూలీలు

Mar 4 2026 7:30 AM | Updated on Mar 4 2026 7:30 AM

ఉరవకొండ/రూరల్‌: కూలీలతో వెళుతున్న వాహనం వెనుక డోర్‌ తెరుచుకోవడంతో శ్రామికులు ఒక్కసారిగా రోడ్డుపై పడి గాయపడ్డారు. ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కణేకల్లు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన 20 మంది కూలీలు మంగళవారం ఉదయం టాటా ఏస్‌ వాహనంలో మిరప పంట తొలచేందుకు నింబగల్లుకు బయలుదేరారు. గ్రామ పరిసరాల్లోకి చేరుకోగానే వాహనం వెనుక డోర్‌ తెరుచుకోవడంతో కూలీలు రోడ్డుపై పడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement