వైభవంగా రంగనాఽథుని కల్యాణం
తాడిపత్రిటౌన్: మండలంలోని ఆలూరు కోన రంగనాథుని ఆలయంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత ఆలూరు రంగనాయకుని కల్యాణం వైభవంగా జరిగింది. పట్టువస్త్రాలు, పూలహారాలతో ఉత్సవ విగ్రహాలను అలంకరించి వేదమంత్రాల నడుమ మంగళవాయిద్యాలతో అర్చకులు ఘనంగా కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి వారి కల్యాణం తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆలయ పురవీధుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తర్వాత భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


