ముక్కోటికి ముస్తాబు
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఖాద్రీశుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఆలయాన్ని ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరిస్తున్నారు. శ్రీవారు భక్తులకు మంగళవారం తెల్లవారుజాము 3.30 గంటల నుంచి దర్శనమిస్తారని, సాయంత్రం 5.30 గంటలకు
తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు
ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. – కదిరి టౌన్:
ముక్కోటికి ముస్తాబు
ముక్కోటికి ముస్తాబు


