ముక్కోటికి ముస్తాబు
● సర్వాంగ సుందరంగా ఖాద్రీశుని ఆలయం
● వివిధ పుష్పాల అలంకరణలో
ప్రజ్వరిల్లుతున్న వైష్ణవాలయాలు
కదిరి టౌన్: ముక్కోటి ఏకాదశికి జిల్లాలోని వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. వివిధ పుష్పాలతో పాటు, విద్యుత్ కాంతులతో ఆలయాలు ప్రజ్వరిల్లుతున్నాయి. వివిధ ఆలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించడంతో సోమవారం రాత్రి నుంచి భక్తులు ఆలయాల వద్ద పోటెత్తారు.
తెల్లవారుజాము నుంచే ఖాద్రీశుని దర్శనం..
మూక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 3.30 గంటల నుంచే ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముక్కోటి సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో, మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఖాద్రీశుని దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సోమవారం ఆలయ ఆధికారులకు సూచించారు.
ముక్కోటికి ముస్తాబు
ముక్కోటికి ముస్తాబు
ముక్కోటికి ముస్తాబు
ముక్కోటికి ముస్తాబు


