సందడిగా అ‘పూర్వ’ కలయిక
నల్లచెరువు: మండల పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 1996–97లో పదో తరగతి చదివిన విద్యార్థులు 27 ఏళ్ల తరువాత అదే పాఠశాలలో ఆదివారం కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంతోషంగా గడిపారు. నాడు చదువులు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనతరం రూ.1.60 లక్షల వేలు విలువైన 7 సీసీ కెమెరాలు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయించారు.
హిందూపురం టౌన్: పట్టణంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల (ఎంజీఎం)లో 2000 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులందరూ ఆదివారం అదే పాఠశాలలో అపూర్వ సమ్మేళనంలో పాల్గొన్నారు. 25 ఏళ్ల తర్వాత ఒకే చోటికి చేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాము కూర్చున్న క్లాస్ రూమ్‌లో కూర్చుని అనుభవాలను పంచుకున్నారు. అనంతరం హెచ్‌ఎం రంగనాయకులును ఘనంగా సత్కరించారు.
లేపాక్షి: లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు రోజులుగా జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్బంగా 31 బ్యాచ్‌లకు సంబందించిన 2 వేల మంది పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ వివిధ సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు వేమనారాయణ, వినోద్‌కుమార్, రాజారెడ్డి, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది నవోదయ విద్యాలయంలో అల్యూమినియం మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యాలయం అభివృద్ధితో పాటు పలువురు విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేశామన్నారు.
సందడిగా అ‘పూర్వ’ కలయిక
సందడిగా అ‘పూర్వ’ కలయిక


