ప్రభుత్వ సేవలలో నాణ్యత పెంచాలి
ప్రశాంతి నిలయం: క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలలో నాణ్యత పెంచాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై పంచాయతీ, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, సర్వే, జీఎస్‌డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, డ్వామా, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలలో నాణ్యత పెంచాలన్నారు. ఉపాధి హామీ, పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనులు తదితర వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సర్వేల నిర్వహణలో పారదర్శకంగా ఉండాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పిల్లలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. సమావేశంలో డీపీఓ సమత, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బయ్య, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి సుధాకర్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్


