పెద్దపప్పూరు: రైతులు భూముల్లో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను అపహరించుకెళ్లే ఇద్దరు రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలు... పెద్దపప్పూరు మండలం తురకపల్లికి చెందిన దివాకర్‌రెడ్డి, ఖాజాపీరా (బొలెరో యజమాని) శుక్రవారం బొలెరోలో డ్రిప్ పైపులు తరలిస్తుండగా చెర్లోపల్లి సమీపంలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇద్దరూ తడబడడంతో తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. చెర్లోపల్లికి చెందిన రైతులు వెంకట్రామిరెడ్డి, శివశంకరెడ్డి పొలాల్లో ఉన్న రూ.1.20 లక్షల విలువ చేసే డ్రిప్ పైప్‌లను చోరీ చేసి తరలిస్తున్నట్లుగా అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ శరత్‌చంద్ర తెలిపారు.