టీడీపీ గూండాగిరి | - | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాగిరి

Oct 2 2026 12:16 AM | Updated on Oct 2 2026 12:16 AM

నెల్లూరు (టౌన్‌): స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల నేతలు జోక్యం చేసుకోరాదంటూ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ చెప్పినా, క్షేత్రస్థాయిలో అదంతా బోగస్‌ అనే విషయం స్పష్టమైంది. జిల్లాలో గురువారం నిర్వహించిన ఎలక్షన్లలో కూటమి పార్టీ నేతలు సాగించిన రౌడీయిజమే దీనికి చక్కటి ఉదాహరణగా నిలిచింది. ఇతరులకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. మరికొన్ని చోట్ల నేరుగా బాహాబాహీకి దిగి రణరంగాన్ని సృష్టించారు. జిల్లాలోని అధిక బడుల్లో కూటమి పార్టీలకు చెందిన మద్దతుదారులను ఏకగ్రీవం చేసేందుకు రకరకాల మార్గాలను అన్వేషించారు. భయభ్రాంతులకూ గురిచేశారు. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలకు మద్దతుగా ఎలక్షన్లను హెచ్‌ఎంలు నిర్వహించారు. అసలు ఓటే లేని వారు ప్రవేశించి అలజడి సృష్టించారు.

మొత్తం 2197 విద్యాలయాల్లో..

జిల్లాలోని 2443 పాఠశాలల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అయితే ఇందులో 2197 చోటే జరిగాయి. కమిటీ చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌, సభ్యులను ఎన్నుకున్నారు. వెంకటగిరిలో నిర్వహిస్తున్న పోలేరమ్మ జాతర కారణంగా రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్లోని 224 బడుల్లో ఎన్నికలను వాయిదా వేశారు. కోరం లేదనే కారణాన్ని చూపి 22 చోట్ల పోస్ట్‌పోన్‌ చేశారు. వాయిదా పడిన చోట ఎలక్షన్లను శనివారం నిర్వహించనున్నారు.

జిల్లాకూ పాకిన బెంగాల్‌ పోకడలు..

జిల్లాలో ఏ ఎన్నికలైనా సాధారణంగా ప్రశాంతంగానే జరుగుతాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిక ఎక్కడో బెంగాల్‌లో ఉండే రౌడీయిజం రాజకీయాలు ఇక్కడికీ వ్యాపించాయి. ఇతర పార్టీల మద్దతుదారులపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగడమే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.

● రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌, సీఎం ముఖ్య అనుచరుడు పీర్ల కృష్ణయ్య స్వగ్రామం కొడవలూరు మండలం వెంకన్నపురంలోని పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు విజయం సాధించారు. దీన్ని అధికార పార్టీ నేతలు తట్టుకోలేకపోయారు. ఎలక్షన్‌ ప్రక్రియను రద్దు చేసి పాత కమిటీనే కొనసాగించాలంటూ వాగ్వాదానికి దిగారు. మీ పిల్లలు బడిలోనే లేనప్పుడు.. మీకేంటి సంబంధమని ప్రశ్నించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు ప్రియాంకపై దాడికి పాల్పడ్డారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు.

● కోవూరు మండలంలోని దామరమడుగు పాఠశాలలో సీపీఎం నేతలపై అధికార పార్టీకి చెందిన కొందరు దాడులకు పాల్పడ్డారు. ఓటేసేందుకు వచ్చిన తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేశారు.

● దగదర్తిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎలక్షన్లలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అనుచరులు.. అధికార పార్టీకి చెందిన మాలేపాటి వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో ఓటేసేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు.

● బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో హెడ్‌మాస్టర్‌ ఏకపక్షంగా వ్యవహరించారంటూ కొందరు ఆందోళన చేపట్టారు.

● సీతారామపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చైర్‌పర్సన్‌ బొజ్జ శ్వేత ఎన్నికపై కోరం లేదని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒకసారి ఎన్నిక జరిపి చైర్‌పర్సన్‌ అభ్యర్థిని డిక్లర్‌ చేశాక కోరం లేదని అభ్యంతరాలు తెలపడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు పేర్కొన్నారు.

● జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అసలు ఓటే లేని వారు స్కూళ్లకొచ్చి అధికార పార్టీ తరఫున బరిలో ఉన్న వారికే వేయాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎస్సెమ్సీ ఎన్నికల్లో అధికార పార్టీ దాష్టీకం

జిల్లాలోని పలుచోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతలు

వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు

అధికార పక్షానికి కొందరు హెచ్‌ఎంల వత్తాసు

బలవంతంగా ఏకగ్రీవాలు చేయించిన తెలుగుదేశం గ్రామ పెద్దలు

వెంకటాచలం, సీతారామపురంలో

ఎన్నిక పూర్తయ్యాక కోరం లేదని వాయిదా

వెంకటాచలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 15 మంది సభ్యులకు ఎన్నికలను నిర్వహించగా, అందులో పదింట్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఐదింట్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. అనంతరం చైర్మన్‌ ఎన్నికలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. అయితే అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి డిక్లరేషన్‌ ఫారం ఇవ్వకుండా ప్రధానోపాధ్యాయురాలు లతను బలవంతంగా బయటకు తీసుకెళ్లి.. కోరం లేదని ప్రకటించి వాయిదా వేశారు.

అధికార మదం తలకెక్కిన టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఖాకీలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సైకిల్‌ పార్టీ పెద్దలు.. చివరికి స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్సెమ్సీ) ఎన్నికలనూ వదల్లేదు. పాఠశాలల అభివృద్ధి, నిధుల వినియోగం తదితరాలకు సంబంధించి నిర్వహించాల్సిన ప్రక్రియలో దూరి గూండాగిరి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని పలు చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతలను సృష్టించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులపై దాడులకూ తెగబడ్డారు. ఎలక్షన్‌ను పారదర్శకంగా నిర్వహించాల్సిన హెచ్‌ఎంలలో కొందరు అందుకు భిన్నంగా తెలుగుదేశానికి మద్దతు పలికారు. ఆ పార్టీ గ్రామ పెద్దలు దగ్గరుండి ఏకగ్రీవాలు చేయించారు. బడుల సర్వతోముఖాభివృద్ధికి పనిచేయాల్సిన ఈ కమిటీల్లోనూ తమ్ముళ్లు రంగప్రవేశం చేయడంపై జిల్లా వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement