పోలేరమ్మా.. కరుణించమ్మా | - | Sakshi
Sakshi News home page

పోలేరమ్మా.. కరుణించమ్మా

Oct 2 2026 12:16 AM | Updated on Oct 2 2026 12:16 AM

● వెంకటగిరి జాతరకు పోటెత్తిన భక్తులు

● క్యూలైన్లలో నలిగిపోయిన

సామాన్య భక్తులు

● కూటమి నేతల సిఫార్సులకే ప్రాధాన్యం

జై పోలేరు.. జైజై పోలేరు..! పోలేరు తల్లీ కరుణించి కాపాడు తల్లీ..! అంటూ భక్తులు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలారు.

వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మను దర్శించి

తన్మయత్వం పొందారు. తల్లి దీవెనల కోసం బారులు తీరారు. గంటల తరబడి క్యూల్లో వేచి ఉండి మరీ అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. లక్షల మంది భక్తులు తరలిరావడంతో వెంకటగిరి

కిక్కిరిసిపోయింది. పోలేరమ్మ నామస్మరణ తో మార్మోగింది. నగరోత్సవంలో బాణసంచా ఆకట్టుకుంది. సామాన్య భక్తులు క్యూల్లో నలిగిపోగా.. కూటమి నేతల సిఫార్సులకే అధికారులు ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు తావిచ్చింది.

వెంకటగిరి(సైదాపురం): వెంటగిరి పోలేరమ్మ జాత ర గురువారం అట్టహాసంగా ముగిసింది. 2023లో జాతరను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించడంతో ప్రాధాన్యం ఏర్పడింది. వివిధ రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోలేరమ్మను దర్శించుకునేందుకు క్యూల్లో గంటల తరబడి నిరీక్షించారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణలో..

పోలేరమ్మ జాతర రాష్ట్ర పండగ కావడంతో కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బారాయుడుతోపాటు అధికారుల పర్యవేక్షణలో సాగింది. సుమారు నాలుగు లక్షల మందికిపైగా భక్తులు వచ్చినట్టు సమాచారం. అమ్మవారి దర్శనం కోసం భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. కూటమి నేతల సిఫార్సులకే పోలీసులు సై అనడంతో సామాన్య భక్తులకు దర్శన భ్యాగం గగనమైపోయింది. ఎటువంటి ప్రొటోకాల్‌ లేని కూటమి నేతలకు రాజమార్గంలో దర్శన ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిచ్చింది.

మెట్టినింట్లో కొలువుదీరి..

జాతరలో భాగంగా బుధవారం అర్ధరాత్రి మెట్టునిల్లు అయిన జీనుగుల వారి వీధి నుంచి వేకువజామున నాలుగు గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేకంగా నిర్మించిన చలువ పందిరిలో కొలువుదీర్చారు. తెల్లవారుజామున నుంచి దర్శనభాగ్యం కల్పించారు. గురువారం ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు క్యూల్లో బారులు దీరారు. ఉచిత దర్శనం, రూ.100, రూ.300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు పాత బస్టాండ్‌ మీదుగా క్యూలైన్‌ను అనుమతించారు. అయితే ఈ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించ లేదు. వెంకటగిరి రాజా కుటుంబీకుల సర్వజ్ఞకుమార యాచేంద్రతోపాటు పలువురు అమ్మవారికి సంప్రదాయం బద్ధంగా సారె సమర్పించారు.

నగరోత్సాహం

అమ్మవారికి సంప్రదాయ బద్ధంగా దున్నపోతును బలిచ్చారు. ఆ తర్వాత గ్రామ పొలిమేర వద్ద పొలి కార్యక్రమం చేపట్టారు. తదనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పూల రఽథంపై పోలేరమ్మ తల్లి ఆశీనులై నగరోత్సవానికి బయల్దేరారు. అమ్మవారి ఆలయ మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం రాజావీధి, కాశీపేట సెంటర్‌, పాత శివాలయంవీధి మీదుగా మల్లమ్మగడి ప్రాంతం, అమ్మవారి నిష్కమణ మండపం వరకు సాగింది. ఈ ఏడాది ఊరేగింపు నిదానంగా సాగడంతో భక్తులు అమ్మవారిని తనివి తీరా దర్శించుకున్నారు.

● దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈఓ శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షణలో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.

● జాతరకు వచ్చిన భక్తులకు కష్టాలు తప్పలేదు. ఎక్కడ చూసినా వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించింది. గంటల తరబడి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. పోలీసులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించకుండా పోయాయి.

● జాతరలో మద్యం ఏరులై పారింది. షాపులు బుధవారం రాత్రే మూసివేయాల్సి ఉంది. కానీ అధికారులు అవేవీ పట్టించుకోలేదు. గురువారం తెల్లవారుజామువరకు విక్రయాలు సాగాయి.

● పోలేరమ్మ తల్లిని కర్ణాటక హైకోర్టు జడ్జి సుమలత, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, కోవూరు ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, ప్రశాంతిరెడ్డి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, ఎస్‌ఈసీ సభ్యులు బొల్లిగర్ల మస్తాన్‌యాదవ్‌ దర్శించుకున్నారు. ఏఎస్పీ రవి మనోహరాచారి, జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరాజు, డీఎస్పీ చెంచుబాబు, శ్రీకాశహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement