అంబేడ్కర్‌ వర్సిటీలో ప్రవేశాలు | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ వర్సిటీలో ప్రవేశాలు

Oct 2 2026 12:16 AM | Updated on Oct 2 2026 12:16 AM

నెల్లూరు (టౌన్‌): అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో 2026 – 27 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని నెల్లూరు రీజినల్‌ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ పిచ్చయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు డిగ్రీలో చేరొచ్చని చెప్పారు. ఆసక్తి గల వారు ఈ నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 73829 29611, 94931 69101 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

జెడ్పీకి నూతన సీఈఓ..?

నెల్లూరు(పొగతోట): జెడ్పీకి నూతన సీఈఓను నియమించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెండ్రోజుల్లో రానున్నాయని తెలుస్తోంది. సీఈఓ శ్రీధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ పొందిన నాటి నుంచి ఈ బాధ్యతలను వసుమతి నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె జిల్లాకు చెందిన వారు కావడంతో నూతన సీఈఓను నియమించనున్నారు. తిరుపతి డీడీఓగా పనిచేస్తున్న సుశీల, నెల్లూరు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, పశ్చిమ గోదావరి డ్వామా పీడీగా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్‌ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఫైల్‌ రాష్ట్ర పీఆర్‌ అధికారుల వద్ద ఉందని తెలుస్తోంది.

అక్టోబర్‌లో

నారుమడులు వేయొద్దు

నెల్లూరు(వేదాయపాళెం): కాలువలు, బోర్లపై ఆధారపడి అక్టోబర్‌లో రబీ సీజన్‌కు సంబంధించిన నారుమడులను వేయొద్దని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి గురువారం ఒక ప్రకటనలో కోరారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి లభ్యతను అనుసరించి అపరాలు, పీఎమ్డీఎస్‌, పశుగ్రాస పంటలను వేసుకోవాలని సూచించారు. 35 శాతం సబ్సిడీపై 4900 క్వింటాళ్ల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆత్మనిర్భర్‌ పథకం ద్వారా 450 క్వింటాళ్ల మినుమును 80 శాతం సబ్సిడీపై రైతులకు అందజేయనున్నామని వెల్లడించారు. రబీ పంట కాలానికి గానూ బీమా చేయించుకోవాలని సూచించారు.

పింఛన్ల

పంపిణీ @ 92.41 శాతం

నెల్లూరు(పొగతోట): సామాజిక పింఛన్ల నగదు పంపిణీ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. 92.41 శాతం మంది లబ్ధిదారులకు నగదును అందజేశారు. మిగిలిన వారికి అందజేయనున్నామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement