సోమశిలలో 17.39 టీఎంసీలు | - | Sakshi
Sakshi News home page

సోమశిలలో 17.39 టీఎంసీలు

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

న్యూస్‌రీల్‌

సోమశిల: సోమశిల జలాశయంలో శుక్రవారం సాయంత్రానికి 17.39 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 10,504 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

జీరో దందాతో జిల్లాలోని కొందరు వ్యాపారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. పన్నులను చెల్లించకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకొని వినియోగదారులకు అంటగడుతూ భారీగా ఆర్జిస్తున్నారు. ఈ అక్రమాలపై దాడులు జరిపి ప్రభుత్వాదాయాన్ని పెంచాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, తమ జేబులు నింపుకోవడంపైనే ధ్యాస పెడుతున్నారు.

నెల్లూరు(టౌన్‌): జిల్లాలోని వ్యాపార రంగంలో జీరో దందా నడుస్తోంది. కొందరు వ్యాపారులు మాఫియాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి వే బిల్లుల్లేకుండా వివిధ వస్తువులను భారీగా తీసుకొచ్చి విక్రయాలను సాగిస్తున్నారు. ఇలా ప్రతి నెలా రూ.కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. ప్రధానంగా బంగారం, వెండి ఆభరణాలను పెద్ద మొత్తంలో తీసుకొస్తున్నారు. బెంగళూరు, చైన్నె, ముంబై, ఢిల్లీ, సూరత్‌ తదితర ప్రాంతాల నుంచి ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, రకరకాల దుస్తులనూ తరలిస్తూ పెద్ద ఎత్తున విక్రయాలు సాగిస్తున్నారు. ఇందులో 80 శాతానికిపైగా వస్తువులకు బిల్లులే ఉండవని వ్యాపారులే చెప్తున్నారు. వస్తువులను ప్రతి నెలా భారీగా విక్రయిస్తున్నా, జీఎస్టీ అధికారులకు మాత్రం మొక్కుబడిగా రూ.వేలల్లో వ్యాపారం జరుగుతోందని చూపుతున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లా పరిధిలో 17 వేల మందికిపైగా రెగ్యులర్‌.. 3500 మందికిపైగా కాంపోజిషన్‌ పన్ను చెల్లింపుదారులున్నారు. ఏడాదికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల్లోపు వ్యాపారం చేసే డీలర్లు ప్రతి మూడ్నెల్లకోసారి.. రూ.50 లక్షలకుపైగా వ్యాపారం చేసే డీలర్లు.. రిటర్న్స్‌ను ప్రతి నెలా చూపాల్సి ఉంది. ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు, నెయ్యి, వెన్న, సోపులు, షాంపులు, టూత్‌పేస్ట్‌, రూ.2500లోపుండే దుస్తులుకు ఐదు శాతం జీఎస్టీని చెల్లించాలి. సిమెంట్‌, టీవీలు, ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు ఇతర ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, సాధారణ మోటార్‌ వాహనాలకు 18.. ఖరీదైన లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, పాన్‌ మసాలా, కూల్‌డ్రింక్స్‌ తదితరాలపై 40.. బంగారం, వెండిపై మూడు శాతం జీఎస్టీని చెల్లించాలి.

నిద్రావస్థలో..

జిల్లాలో దుకాణాదారుల ఆగడాలపై తనిఖీలను విజిలెన్స్‌ అధికారులే చేపడుతున్నారు. వాస్తవానికి వే బిల్లుల్లేకపోయినా.. జీఎస్టీని చెల్లించకపోయినా.. అధిక ధరలకు విక్రయిస్తున్నా.. డూప్లికేట్‌, నాసిరకం వస్తువులను అమ్ముతున్నా, తనిఖీలు చేయాల్సింది జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. అయితే వీరికి ఏ మాత్రం పట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని వ్యాపారుల నుంచి మామూళ్లను పుచ్చుకొని కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. వ్యాపారం ఎంత జరిగినా.. వ్యాపారి చెల్లించినంత జీఎస్టీకే పచ్చజెండా ఊపుతున్నారు. విజిలెన్స్‌ అధికారులు గుర్తిస్తున్న అక్రమాలను.. వాణిజ్య పన్నుల అధికారులు ఎందుకు నిగ్గుతేల్చలేకపోతున్నారనేదే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఫలితంగా ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. కాగా జీఎస్టీ ఎగవేతపై వాణిజ్య పన్నుల శాఖ జేసీ కిరణ్‌ను సంప్రదించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

ఇతర ప్రాంతాల నుంచి బంగారం, ఎలక్ట్రానిక్స్‌ జిల్లాకు రాక

విక్రయాలు రూ.లక్షల్లో..

లెక్కల్లో చూపేది రూ.వేలల్లో

జీఎస్టీకి భారీగా ఎగనామం

ఒరిజినల్స్‌ స్థానంలో డూప్లికేట్‌ను విక్రయిస్తూ..

విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో వెలుగుచూస్తున్న ఎగవేతలు

మామూళ్లతో సరిపుచ్చుకుంటున్న ఆఫీసర్లు

ప్రభుత్వాదాయానికి భారీగా గండి

ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో డూప్లికేట్‌ వస్తువులను తీసుకొచ్చి, వాటికి ఆయా కంపెనీల బ్రాండ్ల స్టిక్కర్లను అతికించి వినియోగదారులకు అధిక మొత్తానికి అంటగడుతున్నారు. ఉదాహరణకు ఎలక్ట్రికల్‌ ఒరిజినల్‌ వైర్లకు సంబంధించి క్యూఆర్‌ కోడ్‌ ఉండాలి. అయితే ఇవేవీ లేకుండానే అమ్ముతున్నారు. బిల్లులను అడిగితే తెల్ల కాగితంపై ధరేసి ఇస్తున్నారు. జీఎస్టీ నంబర్‌తో ఉన్న ఒరిజినల్‌ బిల్లును ఎక్కడా ఇవ్వడం లేదు. ఒక వేళ అడిగితే వస్తువు ధర పెరుగుతుందనే సమాధానమొస్తోంది. మరోవైపు రూ.300కుపైగా ఉన్న ప్రతి వస్తువుకూ బిల్లును తప్పక ఇవ్వాలనే నిబంధన ఉన్నా, జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement