గ్రావెల్‌ తవ్వకాలపై రగడ | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ తవ్వకాలపై రగడ

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● అడ్డుకున్న గ్రామస్తులు

● తమ్ముళ్ల మధ్య వాగ్వాదం

పొదలకూరు: పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి తిప్ప సర్వే నంబర్‌ – 707లో గ్రావెల్‌ తవ్వకాలు, తరలింపుపై పెద్ద ఎత్తున రగడ జరిగింది. పొక్లయిన్‌తో తవ్వకాలు సాగిస్తూ టిప్పర్లకు గ్రావెల్‌ను ఎత్తుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన వారి మధ్యే వాగ్వాదం చోటుచేసుకుంది. తిప్పకు సమీపంలోనే ఉన్న చిట్టేపల్లి గ్రామస్తులు, నేతలు.. గ్రావెల్‌ తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతానికెళ్లి అనుమతుల్లేకుండా ఎలా తరలిస్తారంటూ అడ్డుకున్నారు. అయితే అదే పార్టీకి చెందిన కొందరు తమ వద్ద అన్ని రకాల అనుమతులున్నాయని.. పొల్యూషన్‌, మై నింగ్‌ తదితర శాఖ ల నుంచి పర్మిష న్లు పొందామని ఉత్తర్వులున్నాయని చూపేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. గ్రావెల్‌ను ఇక్కడ్నుంచి తరలించేందుకు ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇప్పటికే కొండ కరిగిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రావెల్‌ తరలింపు వివాదాస్పదంగా మారింది. ఈ ప్రాంతాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇటీవల పరిశీలించారు. చిట్టేపల్లి తిప్ప నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా గ్రావెల్‌ను తరలిస్తున్నారని అప్పట్లోనే ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement