అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

అనుబంధ విభాగ కమిటీల్లో నియామకాలు

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గానికి చెందిన పలువురిని జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. క్రిస్టియన్‌ మైనారిటీ సెల్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీలుగా కునాసి భాస్కర్‌రావు, ఎస్సీ సెల్‌ సెక్రటరీలుగా పైనా ఇజ్రాయిల్‌, పచ్చా శివకుమార్‌, సాడేపల్లి ఏషోబు, ఈదూరు వెంకటరమణయ్య, రైతు విభాగ సెక్రటరీలుగా మనుబోలు సుధీర్‌రెడ్డి, దావూరు ప్రసాద్‌, ఐటీ వింగ్‌ సెక్రటరీగా పాలిచెర్ల శ్రావణ్‌కుమార్‌, యూత్‌ సెక్రటరీగా పిన్నాక రజనీకుమార్‌, బీసీ సెల్‌ సెక్రటరీలుగా వంకి శ్రీనివాసులు, ముంగర వెంకటేశ్వర్లు, అన్నం రామచంద్రయ్య, పంచాయతీరాజ్‌ వింగ్‌ సెక్రటరీలుగా దాసరి శ్రీను, ఉప్పాల సుధాకర్‌, మైనారిటీ సెల్‌ సెక్రటరిగా షేక్‌ గౌస్‌బాషా నియమితులయ్యారు.

రేపు చేనేత కార్మిక

సంఘం మహాసభ

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఈనెల 27వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం 14వ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పముజుల హరి పిలుపునిచ్చారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆరోజు సంతపేటలోని రామకోటయ్య భవన్‌లో పముజుల దశరథరామయ్య ప్రాంగణంలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. చేనేత వృత్తిని కాపాడటంతోపాటు కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సభకు ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఇన్‌చార్జి జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీతోపాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. చేనేత కార్మికులు, చేనేత సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రాంబాబు, జిలానీ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

కార్ల విక్రయం పేరుతో రూ.18 లక్షల మోసం

● నిందితుడిపై కేసు నమోదు

నెల్లూరు(క్రైమ్‌): సీజ్‌ చేసిన కార్లను విక్రయిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.18 లక్షలు తీసుకుని మోసగించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు జెండావీధి ప్రాంతానికి చెందిన జహీర్‌కు కడపకు చెందిన అభిల్‌ అహ్మద్‌తో పరిచయమైంది. సీజ్‌ చేసిన నాలుగు కార్లు అమ్ముతానని నమ్మించి జహీర్‌, అతని స్నేహితుల ఖాతాల నుంచి రూ.12 లక్షలను బ్యాంక్‌ ఖాతాలో, మరో రూ.6 లక్షలను నేరుగా తీసుకున్నాడు. అనంతరం కార్లను ఇవ్వకుండా అభిల్‌ అహ్మద్‌ కాలయాపన చేస్తూ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. జహీర్‌ స్నేహితుడి ఖాతాలో రూ.1.66 లక్షలు జమచేసినా ఆ ఖాతాతోపాటు మరో రెండు ఫ్రీజ్‌ అయ్యాయి. తనను మోసగించిన అభిల్‌ అహ్మద్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు శుక్రవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement