కబ్జా కోరల్లో రామన్న చెరువు | - | Sakshi
Sakshi News home page

కబ్జా కోరల్లో రామన్న చెరువు

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● కట్టలు పోసి చేపల గుంతలు ఏర్పాటు

● కూటమి నాయకులు

అండదండలతోనే..

● గుంతలకు అక్రమంగా

విద్యుత్‌ సరఫరా

● నిషేధిత చేపల పెంపకం

● కలుషితమవుతున్న చెరువు నీరు

అల్లూరు: కూటమి నేతల అండదండలతో మండలంలోని సింగపేట పంచాయతీలో ఉన్న రామన్న చెరువును కొందరు ఆక్రమించారు. ఏకంగా కట్టలను ఏర్పాటు చేసి చేపల గుంతల సాగుకు శ్రీకారం చుట్టారు. నిషేధిత ఫంగస్‌ చేపలను పెంచుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ముడుపులు తీసుకుని తమకేమి పట్టనట్లు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వందల ఎకరాల్లో..

రామన్న చెరువు సుమారు 1,420 ఎకరాల వరకు ఉంటుంది. ఇందులో వందల ఎకరాల్లో పలువురు మట్టిని తవ్వి కట్టలుగా పోసి చేపల గుంతలను ఏర్పాటు చేశారు. గుంతలకు విద్యుత్‌ సరఫరా ఇచ్చారంటే ఏ స్థాయిలో కూటమి నేతల అండదండలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గుంతల్లో నిషేధిత క్యాట్‌ ఫిష్‌ తదితర చేపలను పెంచుతున్నారు. మేతగా కోళ్ల వ్యర్థాలను, కుళ్లిన గుడ్లను తదితరాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పెరిగిన చేపల్ని తిన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. అలాగే చెరువు నీరు కలుషితమయేఅవకాశం ఉంది.

చెరువు ద్వారా..

చెరువు ద్వారా అల్లూరు మండలం పరిధిలోని సింగపేట పంచాయతీ, దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల, బోగోలు మండలంలోని అల్లిమడుగ, అగ్రహారం, తిప్ప, తెల్లగుంట గ్రామాల్లోని దాదాపు 8 వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతుంది. చేపల గుంతల సాగుతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి పంటలకు నీరందే పరిస్థితి ఉండదని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రామన్న చెరువులో అక్రమంగా ఏర్పాటు చేసిన చేపలు గుంతలు

చెరువును పరిశీలిస్తున్న ఇరిగేషన్‌ ఏఈ సుధీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement