వైన్‌ షాపులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

వైన్‌ షాపులకు దరఖాస్తుల ఆహ్వానం

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో 51 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శంకరయ్య పేర్కొన్నారు. బీవీనగర్‌లోని ఎకై ్సజ్‌ కార్యాలయంలో వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. జిల్లాలో 198 మద్యం దుకాణాలకు గానూ 154 షాపుల లైసెన్స్‌లు రెన్యువల్‌ అయ్యాయని చెప్పారు. వీటికి నోచుకోని 44 షాపులతో పాటు గతంలో వివిధ కారణాలతో రద్దు చేసిన ఏడు దుకాణాలతో కలిపి 51కి నోటిఫికేషన్‌ను విడుదల చేశామన్నారు. దాఖలుకు తుది గడవు అక్టోబర్‌ ఒకటి అర్థరాత్రి 12 వరకు అని, ఒక్కో దరఖాస్తుకు రూ.మూడు లక్షల నాన్‌ రీఫండబుల్‌ ఫీజు, ప్రాసెసింగ్‌ ఫీజుగా రూ.వెయ్యిని చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక్కో వైన్‌ షాపునకు పది దరఖాస్తులొస్తేనే డ్రాను తీయనున్నామని వెల్లడించారు. ఆసక్తి గల వారు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌, హైబ్రిడ్‌ విధానంలో దరఖాస్తులను దాఖలు చేయొచ్చని చె ప్పారు. అక్టోబర్‌ మూడున పరిశీలన.. కలెక్టర్‌ సమక్షంలో లా టరీ డ్రాను ఐదున తీసి ఎంపికై న వారికి లైసెన్స్‌లను జారీ చే యనున్నామని ప్రకటించారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి శ్రీనివాసులునాయుడు, నెల్లూరు – 1 ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement