కలిగిరి: స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు పురుగులు పట్టిన అల్పహారాన్ని అందించిన ఘటనపై విచారణను జీసీడీఓ శాంతకుమారి శుక్రవారం చేపట్టారు. విద్యార్థినులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. అల్పాహారంలో వాడిన బన్సీ రవ్వలో పురుగులొచ్చాయనే అంశాన్ని డీఈఓ బాలాజీరావు, ఏపీసీ వెంకటసుబ్బయ్య విచారణలో సిబ్బంది అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు చేస్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులను జీసీడీఓ పిలిచి మాట్లాడి.. వారి నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని వెల్లడించారు. ప్రిన్సిపల్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు.


