శ్రీవారి దర్శనానికి 24 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Aug 19 2026 12:00 AM | Updated on Aug 19 2026 12:00 AM

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 79,445 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,834 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

పెండింగ్‌ ఫైళ్లను

క్లియర్‌ చేయండి

డీఎంహెచ్‌ఓకు డాక్టర్ల వినతి

నెల్లూరు(అర్బన్‌): జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులకు సంబంధించిన పెండింగ్‌ ఫైళ్లను సత్వరమే క్లియర్‌ చేయాలని ఏపీ ప్రభుత్వ డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి కోరారు. మంగళవారం పలు పీహెచ్‌సీల డాక్టర్లు డీఎంహెచ్‌ఓ సుజాతను కలిసి వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. డాక్టర్ల ఇంక్రిమెంట్లు, చైల్డ్‌కేర్‌ లీవులు, మెడికల్‌ సెలవులు, ఆర్జిత సెలవులు, రెగ్యులైజేషన్‌ ఫైళ్లు పెండింగ్‌లో ఉంచారన్నారు. సంబంధిత ఈ–1 క్లర్క్‌ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం, మూడు నెలలుగా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది తలెత్తిందన్నారు. ఇప్పటికై నా పరిస్థితి చక్కదిద్దకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఏడుకొండలు, డాక్టర విజయ, డాక్టర్‌ శ్రావణి, డాక్టర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అగ్రి ఎక్స్‌పో,

కిసాన్‌ మేళా నేడు

నెల్లూరు(వేదాయపాళెం): రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో బుధవారం ఉదయం 9 గంటలకు అగ్రి ఎక్స్‌పో, కిసాన్‌మేళా–2026 ప్రారంభించనున్నట్లు డీఏఓ పి.సత్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల కనుగుణంగా పంటల నిర్వహణ, పంటల ఆరోగ్య సంరక్షణ, చీడ పీడలు, తెగుళ్ల నివారణ, సమగ్ర పంట ఆరోగ్య నిర్వహణ, ఆధునిక సాగు విధానం తదితర అంశాలపై వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నిష్ణాతు లు, నిపుణుల సూచనలు, సలహాలు పొందవచ్చన్నారు. ఆధునిక వ్యవసాయానికి అవసరమైన యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement