ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు

Aug 19 2026 12:00 AM | Updated on Aug 19 2026 12:00 AM

సర్వే నంబరు 284లోని ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. అక్కడ కనీస వసతులు కల్పించకపోవడంతో గృహ నిర్మాణాలు జరగలేదు. ఇటీవల ఇళ్ల స్థలాల ధరలు పెరగడంతో ప్లాట్లపై కన్నేసిన కొందరు అక్రమార్కులు కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి అనేక మంది అక్రమాలు చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

– భాస్కర్‌రెడ్డి, సీఐటీయూ నాయకుడు

సర్వే చేయించి

నిర్ణయం తీసుకుంటాం

భట్టువారిపాళెంలో రోడ్డు లోని సర్వే నంబరు 284లో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించి రికార్డులు లేవు. మేము పని ఒత్తిడిలో ఉన్నాం.త్వరలో స ర్వే చేయించి తగిన నిర్ణయం తీసుకుంటాం. ఆ క్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.

– స్వర్ణ, తహసీల్దార్‌, వింజమూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement