ఉదయగిరి రూరల్ : పట్టణంలోని చెక్క నగిషీ కేంద్రంలో పనిచేస్తున్న హస్త కళాకారులకు రాయితీపై అతి తక్కువ ధరకు అవసరమైన కలపను అందిస్తామని ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. శనివారం డీసీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి నుంచి ఉదయగిరితోపాటు రాష్ట్రంలో ఐదు క్లస్టర్ల పరిధిలో ఉన్న ఉడ్ బ్యాంకులను వర్చువల్‌గా ప్రారంభించారు. రేంజ్ అధికారి కుమార్‌రాజా, ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ శ్రీకాంత్‌రెడ్డి ఉడ్ బ్యాంకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ చెక్క నగీషి వస్తువులు తయారు చేసే కళాకారులకు అవసరమైన కర్ర ప్రస్తుతం కొరతగా ఉండడంతో వాటిని అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. కళాకారులు ఎక్కువగా ఉపయోగించే కర్ర అంతరించిపోకుండా రిజర్వు ఫారెస్ట్‌ల్లో పెంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఎఫ్‌ఆర్‌ఓ ఆనంద్, డీఆర్‌ఓ మురళి, ఎఫ్‌ఎస్‌ఓలు శ్రీరామరాజు, ఖాజా మహమ్మద్, కేంద్రం నిర్వహకురాలు గౌసియా బేగం, ఎఫ్‌బిఓలు, ఏబీఓలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్‌లో ప్రవేశాలు
నెల్లూరు (టౌన్): తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో హోమ్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్యులు ఎన్.రజని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌లో బైపీసీ లేదా ఎంపీసీ చదివి కనీసం 45 శాతం మార్కులు సాధించిన మహిళా విద్యార్థినులు అర్హులన్నారు. న్యూట్రిషన్ హెల్త్ కేర్ రంగాలకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ కోర్సు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు మంచి అవకాశాలను అందిస్తుందన్నారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం డైటీషియన్, న్యూట్రినిష్ట్, సీడీపీఓ, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తదితర విభాగాల్లో ఉద్యోగ కెరీర్ అవకాశాలను పొందవచ్చన్నారు. ఆసక్తి ఉన్న మహిళా విద్యార్థినులు ప్రవేశాల కోసం apcfss cap పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశాల కోసం 8374707898, 8985641616, 9550818367 నంబర్లలో సంప్రదించాలన్నారు.


