● కలెక్టర్ హిమాన్షు శుక్లా
● కలెక్టరేట్లో ఘనంగా 80వ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నెల్లూరురూరల్: వికసిత్ భారత్ సాధనలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి హిమాన్షు శుక్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోని 100 అడుగుల స్తూపం వద్ద జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర, స్వర్ణభారత్, వికసిత్ భారత్ దిశగా దేశం, రాష్ట్రం ముందుకు సాగుతున్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


